Dangerous accident: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో వాహనాలపై దూసుకెళ్లింది. ఈదుర్ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 48కార్లు ధ్వంసమయ్యాయి.
మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో వాహనాలపై దూసుకెళ్లింది. ఈదుర్ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 48కార్లు ధ్వంసమయ్యాయి.
2/ 12
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 50వాహనాలు ధ్వంసమయ్యాయి. ఖచ్చితంగా చెప్పాలంటే కార్లు, ఇతర వాహనాలతో కలిసి 48 వెహికల్స్ పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయి. కంటైనర్ డ్రైవర్ పొరపాటు, నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు ప్రాధమిక అంచాన వేశారు.
3/ 12
పూణె-బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో కంటెయినర్ స్పీడుగా వస్తుండగా నావేల్ వంతెన దగ్గర బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. ఊహించని విధంగా కంటైనర్ ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో కార్లు నుజ్జువడంతో వాహనాల యజమానులు షాక్ అయ్యారు.
4/ 12
అదే సమయంలో డ్రైవర్ కంటైనర్‌ని కంట్రోల్ చేయలేకపోవడంతో రోడ్డుపై వెళ్తున్న మరికొన్ని వాహనాలపై దూసుకెళ్లిందని హైవే పోలీసులు తెలిపారు. ఎప్పుడూ రద్దీగా ఉంటే నావేల్ వంతెనపై ఈ యాక్సిడెంట్ జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
5/ 12
కంటైనర్ కార్లు, ఇతర వాహనాలపై దూసుకెళ్లడంతో పదుల సంఖ్యలోనే వాహనాలు రోడ్డులపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తిగా నుజ్జు నుజ్జు అయిన వాహనాలతో హైవేపై ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు.
6/ 12
పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కావడంతో కంటైనర్ డ్రైవర్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రహదారిని మూసివేసి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కంటైనర్ సస్పెన్స్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ఘోరం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
7/ 12
ప్రమాదం జరిగిన వెంటనే పూణె పోలీసులతో పాటు రెస్క్యూ బృందాలు, ఫైర్ సిబ్బంది ఘటన స్తలానికి చేరుకున్నారు. నావేల్ బ్రిడ్జీపై ధ్వంసమైన వాహనాలను తొలగించారు. ట్రాఫిక్ పునరుద్దించేందుకు ప్రయత్నించారు.
8/ 12
కంటైనర్ ట్రక్కు వాహనాలను ఢీకొట్టడం కారణంగా హెవీ వెహికల్ నుంచి ఆయిల్ లీకవడంతో అగ్నిప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో స్పాట్‌కి చేరుకున్నారు. మంటలు చెలరేగకుండా నీటిని చల్లారు.
9/ 12
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతానికి ఆరుగురు వ్యక్తులు గాయపడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కంటైనర్ ఢీకొట్టిన వాహనాలన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరిగిందని పూణె పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
10/ 12
ఈ ఏడాదిలో ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం మరెక్కడా జరగలేదు. కంటైనర్ ఢీకొని ఖరీదైన కార్లు దేనికి పనికి రాకుండా పోయాయి. ముఖ్యంగా కొన్ని వాహనాలు టైర్లు, ముందు అద్దాలతో సహా ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి.
11/ 12
జనం తిరుగుతున్న సమయం, ఆదివారం కావడంతో హైవే రద్దిగా ఉంది..అదే టైమ్‌లో కంటైనర్ బీభత్సం సృష్టించడంతో స్థానికులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి పరుగులుపెట్టుకొని వచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
12/ 12
బెంగుళూరు-పూణె జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్తినష్టం బాగానే జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో కూడా ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.