PRIME MINISTER NARENDRA MODI VISITED THE CONSTRUCTION SITE OF THE NEW PARLIAMENT BUILDING IN DELHI SSR
PM Modi: రాత్రి 8.45కు అక్కడకు వెళ్లి.. సడన్ విజిట్‌తో షాకిచ్చిన ప్రధాని మోదీ..
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ నిర్మాణం జరుగుతున్న కన్స్ట్రక్షన్ సైట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఆదివారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రధాని అక్కడకు వెళ్లారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ నిర్మాణం జరుగుతున్న కన్స్ట్రక్షన్ సైట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఆదివారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రధాని అక్కడకు వెళ్లారు.
2/ 6
అయితే.. సైట్లో ఉన్నవారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ప్రధాని సడన్ ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు. దాదాపు గంట సేపు ఆ సైట్లో పర్యటించిన ప్రధాని మోదీ నిర్మాణం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సైట్ అంతా కలియతిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు.
3/ 6
కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలో ప్రధాని చూపిన చొరవకు అక్కడున్న సివిల్ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయారు. ప్రధానికి నిర్మాణం గురించి సవివరంగా తెలియజేశారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ భవన నిర్మాణం జరుగుతోంది.
4/ 6
కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. 2022 శీతాకాల సమావేశాలు ఈ కొత్త పార్లమెంట్ భవనంలోనే జరిగే అవకాశాలున్నాయి. దాదాపు 64,500 స్వ్కేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం జరుగుతుండటం గమనార్హం.
5/ 6
కొత్త పార్లమెంట్ భవనం.. లోక్‌సభ చాంబర్ 888 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా, రాజ్యసభ చాంబర్లో 384 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా రూపుదిద్దుకుంటోంది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి అంచనా వ్యయం రూ.971 కోట్లు కావడం గమనార్హం.
6/ 6
ఈ భవనం నిర్మాణ దశలో ఉండగా ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది డిసెంబర్లో ఈ నిర్మాణానికి పునాది రాయి పడింది. ఇప్పటివరకూ ఈ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.238 కోట్లు ఖర్చు చేసింది.