PM Narendra Modi : భారత్ అంటే ఉత్తర రాష్ట్రాలే కాదు.. దక్షిణ రాష్ట్రాలు కూడా. కానీ చాలా పార్టీలు ఉత్తర రాష్ట్రాలపై చూపినంత శ్రద్ధ దక్షిణ రాష్ట్రాలపై చూపవు. ఇందుకు ప్రధాన కారణం భాష. ఉత్తరాన ఉన్న చాలా రాష్ట్రాల్లో హిందీ ప్రధాన భాష. ఇక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల భాషలకు హిందీ దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు దగ్గరవ్వడం ఉత్తర రాష్ట్రాల నేతలకు తేలికగా ఉంటుంది. (File Photo - PTI)
దక్షిణాదికి వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నం. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం ఈ నాలుగు భాషలూ దేనికవే అన్నట్లు ఉంటాయి. తెలుగు, కన్నడ మాత్రమే కాస్త దగ్గరగా ఉంటాయి. అందువల్ల సౌత్‌పై జాతీయ పార్టీలు అంతగా ఫోకస్ పెట్టట్లేదు. కానీ ఈసారి సౌత్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం - Image: Wikimedia)
ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవచ్చని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. ఆ కొరతను దక్షిణ రాష్ట్రాల్లో తీర్చుకునేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే.. ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మహబూబ్ నగర్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాలపై ఆల్రెడీ బీజేపీ సర్వే చేయిస్తోందని అంటున్నారు. (File Photo)
తెలంగాణలో ఈసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు బలంగా చెబుతున్నారు. బీఆర్ఎస్కి తామే ప్రత్యామ్నాయం అంటున్నారు. దానికి తగ్గట్టే.. ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూ.. ప్రజల నోట్లో నానుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు లాంటి వారు తరచూ వార్తల్లో నిలుస్తూ.. ప్రజల నోట్లో నాలుకవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వస్తే.. పార్టీకి అనూహ్య ఫలితాలు దక్కుతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. (File Photo)
ఈ సంవత్సరం దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీలో కుమ్ములాటలు పెద్దగా లేవు. అధికారంలో ఉన్నందువల్ల తిరిగి అధికారం దక్కించుకోవడం తేలికే అని భావిస్తున్న కాషాయ దళం... కర్ణాటకలో కంటే.. తెలంగాణ నుంచి పోటీ చేయించడమే ఉత్తమం అని భావిస్తోంది. (File Photo)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ నుంచి అగ్రనేతలు తరచూ రాష్ట్రానికి వస్తున్నారు. సభలూ, సమావేశాలూ జరుపుతున్నారు. త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా తెలంగాణ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టీ.. ఆ తర్వాత 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలి అనే వ్యూహాన్ని కమలదళం రచించబోతున్నారని తెలిసింది. (File Photo)