అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి తెచ్చే ఈ సెక్షన్‌తో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలన్నింటి నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. విద్యుత్తు ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్నీ కేంద్రం ఆదేశాల మేరకే జరుగుతాయి. చట్టప్రకారం ఏమీ చేయలేని స్థితిలో ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11 అమలుపై కొన్ని రాష్ట్రాలు గగ్గోలుపెడుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
బొగ్గు కొరత వల్లే దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. బొగ్గు లభ్యతను పెంచడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. విద్యుదుత్పత్తి సంస్థల్లో బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల అధికారులు, థర్మల్ పవర్ కేంద్రాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇండియలో కేవలం దిగుమతి చేసుకొన్న బొగ్గు ద్వారానే 17,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. అయితే ప్రస్తుతం బొగ్గు దిగుమతులు లేని కారణంగా 7,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు పనిచేయడం లేదు. ప్రస్తుతం బొగ్గు దిగుమతిని పెంచడంతో పాటు దేశీయంగానూ ఉత్పత్తి పెరగనుండటంతో ఈ ప్లాంట్లు కూడా మళ్లీ వినియోగంలోకి రానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)