బీజేపీని నిలువరించే ఎత్తుగడలో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవలే ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలకు ప్రగతి భవన్ లో విందు ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాది నేత తేజస్వీని కూడా హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. అంతకంటే ముందు తమిళనాడు వెళ్లి చీఫ్, సీఎం స్టాలిన్ ను కలిసొచ్చారు. తద్వారా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలను ముమ్మరం చేసినట్లయింది.