మొదటి దశ పోలింగ్ ఓ వైపు జరుగుతుండగా, మరో వైపు అదే రోజు అదే రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఓ భారతీయ నాయకుడు ఇప్పటివరకు చేపట్టని విధంగా తన సొంత రాష్ట్రంలో అతిపెద్ద రోడ్ షో నిర్వహించారు మోదీ. ఈ నెల 5వ తేదీన జరుగనున్న చివరిదైన రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించారు.