అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు అయింది. Photo : Twitter
ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్, ట్రైలర్‌తోనే అర్ధమైంది. ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. Photo : Twitter
ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల పండగ శోభను ముందుగానే తీసుకొచ్చింది. పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది. Photo : Twitter
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి రోజు రూ. 9 కోట్లకు పైగా షేర్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి. ఈ సినిమాకు మొదటి రోజు మొత్తంగా 17 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మొదటిసారి నాగార్జున, నాగ చైతన్య కెరీర్లో హైయ్యేస్ట్ ఫిగర్‌ను టచ్ చేసినట్లు అయ్యిందని అంటున్నారు. Photo : Twitter
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. Photo : Twitter
బంగార్రాజు.. దాదాపు 5 ఏళ్ళకి ముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఇక ముందు నుంచి సంక్రాంతి రేసులో ఉంటామని ప్రకటించిన ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి రేసులో అన్ని సినిమాలే వస్తున్నాయి. బంగార్రాజు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల నలబై నిమిషాల నిడివితో అలరిస్తోంది. Photo : Twitter
ఇక నాగ చైతన్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన బంగార్రాజుతో పాటు ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హార్రర్ జానర్లో వస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. Photo : Twitter
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు అయింది. దీంతో టీమ్ చాలా హ్యాపీగా ఉంది. Photo : Twitter