హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ఢిల్లీ బరిలో అత్యంత ధనికుడిగా గౌతమ్ గంభీర్... మాజీ క్రికెటర్ ఆస్తుల లెక్క ఎంతంటే...

ఢిల్లీ బరిలో అత్యంత ధనికుడిగా గౌతమ్ గంభీర్... మాజీ క్రికెటర్ ఆస్తుల లెక్క ఎంతంటే...

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వం చాలా విభిన్నం. ఎంతటి వారిపైనైనా విమర్శలు చేయడంలో ముందుండే గౌతీ, సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటాడు. కేరళలో వరదల విషయంలో కూడా గౌతమ్ గంభీర్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. సమాజంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల గురించి కూడా తనదైన రీతిలో గళమెత్తుతూ ఉంటాడు గంభీర్. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ ఓపెనర్... అదే స్థానం నుంచి పార్లమెంట్ బరిలో పోటీ చేస్తున్నారు. అతను సమర్పించిన అఫిడెవిట్ ప్రకారం అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డు క్రియేట్ చేశాడు గౌతమ్ గంభీర్.

Top Stories