చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం పవన్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో యోగభ్యాసం నేర్చుకున్నానన్నారు. ధర్మో రక్షిత రక్షిత: అన్నది ఏడుకొండల స్వామి నుంచే నేర్చుకున్నానని, దానిని త్రికరణశుద్ధిగా పాటిస్తున్నానని పేర్కొన్నారు.