తమిళనాడు నుంచి ప్రముఖుల కేటగిరీలో రాష్ట్రపతి కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని రాజ్యసభకు పంపింది. సొంతపార్టీకి కొరకరాని కొయ్యగా మారి, ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పిస్తోన్న సుబ్రమణ్యస్వామి పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆ స్థానంలోనే ఇళయరాజాను రాజ్యసభకు పంపాలని బీజేపీ భావిస్తోంది.(Image Credit: Ilaiyaraaja Twitter/Facebook)
ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నది. అయితే కేంద్రంగానీ, రాష్ట్రపతి కార్యాలయంగానీ ఇప్పటిదాకా అధికారిక ప్రకటనైతే చేయలేదు. ప్రధాని మోదీని బాహాటంగా పొడిగిన కొద్ది రోజులకే ఇళయరాజాకు ఈ ఆఫర్ రావడం గమనార్హం.(Image Credit: Ilaiyaraaja Twitter/Facebook)