తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
2/ 9
సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది.
3/ 9
ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ కాస్త కేసీఆర్ వర్సెస్ కోదండరామ్గా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
4/ 9
తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీని సమన్వయపరుస్తు ముందుకు సాగుతున్నది కోదండరామే కావడం విశేషం.
5/ 9
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టాలని కోదండరాం ప్రయత్నించారని... ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్... వారిని పిలిచి చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
6/ 9
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్తో పాటు బీజేపీ మద్దతును కూడగట్టడంతో పాటు ఇతర పార్టీల సపోర్ట్ కూడా రావడంతో కోదండరాం కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
7/ 9
తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె సమయంలో ఉద్యమాన్ని ఎక్కువ రోజులు కొనసాగించేలా వ్యూహరచన చేసిన కోదండరాం... ఈ సారి తన అనుభవాన్ని ఆర్టీసీ కార్మికుల సమ్మె కోసం వినియోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
8/ 9
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కోదండరాం రంగంలోకి దిగాడని తెలిసిన తరువాతే... సీఎం కేసీఆర్ కూడా ఈ మొత్తం అంశాన్ని సీరియస్గా తీసుకుని తన రాజకీయవ్యూహాలకు పదునుపెట్టారని ప్రచారం జరుగుతోంది.
9/ 9
మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మరోసారి కేసీఆర్ వర్సెస్ కోదండరాం అన్నట్టుగా ఉందని పలువురు భావిస్తున్నారు.