Myna: చిన్నారి కోసం స్కూల్‌కు వస్తున్న మైనా.. స్కూల్ అవ్వగానే.. ఎగిరిపోతుంది. !
Myna: చిన్నారి కోసం స్కూల్‌కు వస్తున్న మైనా.. స్కూల్ అవ్వగానే.. ఎగిరిపోతుంది. !
అంకిత స్కూల్లో చేరిన రోజు నుంచి మైనా కూడా ఆమెతో పాటు స్కూల్‌కి వెళ్తోంది. అంకిత ఇతర స్నేహితులతో కలిసి పాఠశాలకు వస్తుంది. అంకిత స్కూల్ కి రాగానే మిథూ చెట్టు మీద నుండి ఎగిరి అంకిత భుజం మీద లేదా తల మీద కూర్చుంది.
చాలామందికి జంతవులు, పక్షులు అంటే చాలా ఇష్టం. కొందరు తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటూ ఉంటారు. కొందరు కుక్కల్ని, పిల్లల్ని, కుందేళ్లను పెంచుతూ ఉంటారు. మరికొందరు కోళ్లు, చిలకలు, పావురాలు, లవ్ బర్డ్స ఇలా రకరకాల పక్షుల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు.
2/ 8
అయితే ఓ పక్షితో చిన్నారికి కుదిరిన స్నేహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అరుదైన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. వెస్ట్ బర్ధమాన్‌లోని కాంక్సాలోని శివపూర్ ప్రాథమిక పాఠశాలలో అంకిత అనే చిన్నారి చేరింది.
3/ 8
ఇక అంకిత స్కూల్ కి వచ్చినప్పుడల్లా మిథు అనే ఇండియన్ మైనా అంకితతో క్లాస్ రూమ్ కి వస్తుంది. అంకిత క్లాస్‌రూమ్‌లో ఉన్నంత సేపూ మిథూ అనే మైనా అక్కడే ఉంటుంది. అంకిత మిథు నోటిలో ఆహారం పెడుతూ ఉంటుంది.
4/ 8
అంకిత ఇంటికి వెళ్ళగానే, మిథూ కూడా తన ఇంటికి తిరిగి వెళ్తుంది. శివపూర్ ప్రాథమిక పాఠశాలకు ప్రతిరోజూ అనేక మంది చిన్న బాల బాలికలు వస్తుంటారు. స్థానిక ప్రాంతానికి చెందిన అంకితా బగ్దీ ఈ ఏడాది శివపూర్ ప్రాథమిక పాఠశాలలో చేరింది.
5/ 8
అంకిత స్కూల్లో చేరిన రోజు నుంచి మైనా కూడా ఆమెతో పాటు స్కూల్‌కి వెళ్తోంది. అంకిత ఇతర స్నేహితులతో కలిసి పాఠశాలకు వస్తుంది. అంకిత స్కూల్ కి రాగానే మిథూ చెట్టు మీద నుండి ఎగిరి అంకిత భుజం మీద లేదా తల మీద కూర్చుంది.
6/ 8
అంకిత క్లాస్‌రూమ్‌లో ఉన్నంతసేపూ మిథూ కూడా అక్కడే ఉంటుంది. అంకిత ప్రేమగా మిథుకి బిస్కెట్ ముక్కలు కూడా తినిపిస్తూ ఉంటుంది. అంకితను చూసి మిగతా స్టూడెంట్స్ .. స్కూల్ టీచర్లు కూడా మిథు నోటికి ఆహారం అందిస్తూ ఉంటారు.
7/ 8
చిన్నారి పట్ల పక్షి చూపిస్తున్న ఈ ప్రేమను చూసి శివపూర్ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మైనా చూడని రోజు తను బాధపడుతుందని అంకిత చెప్పింది. అయితే అంకిత స్కూల్‌కు రాని రోజు.. మైనా కూడా అక్కడకు రాదు.
8/ 8
అయితే మైనా వెంట మిథు కూడా తిరుగుతోంది. కొన్నిసార్లు మైనా చిన్నారితో కలిసి అంకిత ఇంటికి వెళ్తుంది. అలాంటి ప్రేమను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఆ మైనాతో అంకిత మాత్రమే కాదు.. అందరూ మిథూతో ప్రేమలో పడ్డారు, టీచర్ , విద్యార్థులు కూడా మైనాను ఎంతగానో ఇష్టపడుతున్నారు.