Eetala Rajender: ఈటల నోట ఎవరూ ఊహించని మాట.. బీజేపీ నేతలు షాక్
Eetala Rajender: ఈటల నోట ఎవరూ ఊహించని మాట.. బీజేపీ నేతలు షాక్
Eetala Rajender: తెలంగాణలో హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. 6 నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే ఇప్పటికే హుజురాబాద్‌లో ఈటల ప్రచారం చేస్తున్నారు. ఆయన భార్య జమున కూడా ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఈటల రాజేందర్ చేరితో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. దుబ్బాక తరహాలోనే హుజురాబాద్‌లో కాషాయ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ క్రమంలో హుజూరాబాద్‌లో శనివారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.
2/ 4
ఆ సమావేశంలో ఈటల రాజేందర్ నోటి నుంచి ఎవరూ ఊహించని మాట వచ్చింది. ఏ అంశం మీదైనా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే ఈటల రాజేందర్..ఈసారి మాత్రం కాస్త తడబడ్డారు. నోరు జారి నాలుక కరచుకున్నారు.
3/ 4
ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు. కాషాయ జెండా ఎగురుతుందని అనబోయి.. అలవాటులో పొరపాటులా గులాబీ జెండా అనేశారు. వెంటనే మళ్లీ తేరుకొని కాషాయ జెండానే ఎగరుతుందని అన్నారు.
4/ 4
గులాబీ జెండా ఎగురుతుందని ఈటల వెనడంతో.. పక్కనే ఉన్న బండి సంజయ్ షాక్ తిన్నారు. నవ్వుతూనే.. కాషాయ జెండా అని పొరపాటును సవరించే ప్రయత్నం చేశారు. ఐతే ఈ వీడియో చూసిన వారంతా.. ఈటలలో ఇంకా పాత వాసనలు పోలేదని సెటైర్లు వేస్తున్నారు.