బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర(BHARAT JODO YATRA)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. పాదయాత్ర సమయంలోనే పలు చోట్ల బహిరంగ సభలు,వివిధ వర్గాల ప్రజలతో సంభాషణ కార్యక్రమాలు ఉంటాయి.
దాదాపు 30 ఏళ్ల క్రితం వర్గ విభేదాల కారణంగా కర్ణాటకలోని బడనవాలు అనే గ్రామంలో నరమేధం జరిగింది. ఇప్పటివరకు ఆ వార్గాల మధ్య ఆ దూరం అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాలతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. విరిగిపోయిన వారి మనసులను తిరిగి రాజీ పడేలా చేశారు. ఇది భారత్ జోడో విజయం అని కాంగ్రెస్ తెలిపింది.
అక్టోబర్ 14 వ తేదీన ఏపీలోకి జోడో యాత్ర ఎంట్రీ కానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 4రోజుల పాటు 95 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. జిల్లా ఓబులాపురం మీదుగా ఈ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.