విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. బీజేపీ-జనసేన మినహా అన్ని పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనే ఉరకు వెనక్కు తగ్గమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.