ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో ఎవరూ ఊహించని విధంగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అమిత్ షా. మొదట అమిత్ షాకు ఆర్థిక శాఖ ఇస్తారనే ప్రచారం జరిగినా... చివరకు ఆయన హోంశాఖ దక్కించుకున్నారు. హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఏం చేయబోతున్నారనే అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే అమిత్ షాకు హోంశాఖ అప్పగించడం వెనుక మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించానే టాక్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ( జాతీయ పౌర రిజిష్టర్) అమలు చేస్తామని మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అమలుపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాలని మోదీ భావిస్తున్నారు. ఇందుకు అమిత్ షా అయితేనే సరైన వ్యక్తి అని నరేంద్రమోదీ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఎన్ఆర్సీతో పాటు కాశ్మీర్లో పరిస్థితి చక్కదిద్దే విషయంలో అమిత్ షాకు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎన్ఆర్సీ, కాశ్మీర్‌తో పాటు దేశంలోని పలు భద్రతా అంశాలపై అమిత్ షా దృష్టి పెట్టునున్నారు.