చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టబోతుండటం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో శశికళ ముసలం మొదలైంది. శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్నాడీఎంకే కీలక హెచ్చరిక చేసింది.