దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ క్రమంలోనే దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులను సమీక్షించేందకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. (కేబినెట్ భేటీ-ఫైల్ ఫొటో)
3/ 6
ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. (కేబినెట్ భేటీ-ఫైల్ ఫొటో)
4/ 6
దేశంలో నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు, నియంత్రణకు అనుసరించాల్సిన మార్గాలు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
5/ 6
ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. కొత్తగా కరోనాతో 3,645 మంది మరణించడంతో.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,04,832 కు చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)