వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై ఎన్డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ)తో సమావేశం అయ్యారు. ఘటనపై ఓ కమిటీ వేసిన ప్రధాని మోదీ... దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందనే అంశంపై కమిటీ అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీని ప్రభావాన్ని ఏ రకంగా తగ్గించాలనే దానిపై కూడా నిపుణులతో చర్చించాలని ప్రధాని మోదీ కమిటీని ఆదేశించారు. (Image: ANI)
ఈ కెమికల్ ప్రభావాన్ని ఏ రకంగా తగ్గించవచ్చనే అంశంతో పాటు సమస్యను సాధ్యమైనంత తొందరగా ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై ప్రధాని మోదీ సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖతో పాటు ఎన్డీఏమ్ఏ అధికారులను ఆరా తీసిన ప్రధాని నరేంద్రమోదీ... ప్రధాని నుంచి ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. (Image: ANI)