ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఈరోజు ఉదయం కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నాన్ని(National Emblam)ఆవిష్కరించారు.
2/ 8
జాతీయ చిహ్నం మొత్తం 9500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో తయారు చేయబడింది. ఇది న్యూ పార్లమెంట్ భవనం యొక్క సెంట్రల్ ఫ్లోర్ పైభాగంలో ఏర్పాటు చేయబడింది. జాతీయ చిహ్నానికి సపోర్ట్ గా 6500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణం నిర్మించబడింది.
3/ 8
కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నం యొక్క కాన్సెప్ట్ స్కెచ్ మరియు కాస్టింగ్ ప్రక్రియ క్లే మోడలింగ్/కంప్యూటర్ గ్రాఫిక్ నుండి కాంస్య కాస్టింగ్ మరియు పాలిషింగ్ వరకు ఎనిమిది విభిన్న దశల తయారీలో సాగింది.
4/ 8
కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నం ప్రారంభోత్సంలో ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా,కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు.
5/ 8
పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ,స్పీకర్ ఓం బిర్లా
6/ 8
కొత్త పార్లమెంట్ పనుల్లో నిమగ్నమైన శ్రమజీవులతో మాట్లాడారు.
7/ 8
. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు ప్రధాని.