దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాల్లో కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆలయ సుందరీకరణ పనులు, కారిడార్ ప్రారంభోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో వారణాసిలో పండుగ వాతావరణం నెలకొంది. 55 అత్యాధునిక కెమెరాలు, భారీ డ్రోన్లతో ప్రాజెక్ట్ అందాలను చిత్రీకరిచనున్నారు.