ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11.37 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 1.58 లక్షల కోట్ల రూపాయలను జమచేశారు. త్వరలో 10వ విడత పీఎం కిసాన్ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. డిసెంబరు 15న పదో విడత డబ్బులను కేంద్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈసారి కొందరికి పీఎం కిసాన్ డబ్బులు రావు. ఎందుకంటే లబ్ధిదారుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పేద రైతులుగా తప్పుడు పత్రాలు చూపించి పీఎం కిసాన్ డబ్బులను తీసుకుంటున్నారు. వీరందరికి ఇక నుంచి పీఎం కిసాన్ డబ్బులు రావు. అంతేకాదు గతంలో తీసుకున్న డబ్బులను కూడా చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పీఎం కిసాన్ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, అనర్హులు కూడా డబ్బులు తీసుకుంటున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో పీఎం కిసాన్ పథక లబ్ధిదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. విచారణ జరిపారు. అనంతరం అనర్హులను జాబితా నుంచి తొలగించారు.(ప్రతీకాత్మక చిత్రం)