అంతేకాదు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తును మరింత సులభతరం చేశారు. ఎవరైనా కొత్తగా ఈ పథకానికి అప్లై చేయాలనకుంటే.. వ్యవసాయ విస్తరణ అధికారికి ఖతౌనీ, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ హార్డు కాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. వాటిని పీడీఎఫ్ రూపంలో నేరుగా వెబ్సైట్లోనే అప్లోడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
రైతుల పేరుతో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టటడంతో పాటురిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎం కిసాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను చేసింది. రైతులు ఈ మార్పులను గమనించాలి. వెంటనే రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్లో సమర్పించాలి. అప్పుడే తదుపరి విడత డబ్బులు వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)