ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అనంతరం బెనిఫిషరీ లిస్ట్ (Beneficiary List)ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామం వివరాలు అడుగుతుంది. మీ గ్రామాన్ని ఎంచుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ (Get Report) ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ గ్రామంలోని లబ్ధిదారుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)