కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందిస్తుండటం తెలిసిందే. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ప్రస్తుతం 11వ విడత డబ్బుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం ‘రైతు భాగస్వామ్యం-ప్రాధాన్యత హమారీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులకు KCC (కిసాన్ ) కార్డులు అందిస్తుండటం, ఈ పథకాన్ని కూడా PM కిసాన్ పథకానికి అనుసంధానించడంతో సాంకేతిక సమస్యలు రాకుండా ఈ-కేవైసీ ఆప్షన్ ను కొంత కాలం పాటు తొలగించి మళ్లీ తెచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫండ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్(ఎఫ్‌టీవో) అప్డేట్ ను రైతులు ఈ-కేవైసీలో చూసుకొనే విధానం నంబర్ల వారీగా.. 1. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వెబ్‌సైట్‌పై ( https://pmkisan.gov.in/) తెరవాలి. 2. ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపించనుంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ వార్తలు, పీఎం కిసాన్ స్కీమ్, యూనిక్ ఐడీ, రైతులకు స్కీమ్స్" width="1200" height="800" /> 3)బెనిఫిషియరీ స్టేటస్ కొత్త పేజీలో ఓపెన్ అయ్యాక, మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా నంబర్ ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోండి. 4)ఈ మూడు నంబర్ల ద్వారా మీ ఖాతాకు డబ్బు వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. 5)మీరు ఎంచుకున్న ఎంపిక సంఖ్యను నమోదు చేయండి. 6)ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొత్తం లావాదేవీ సమాచారాన్ని పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆధార్ నెంబర్ లింకింగ్, పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్, పీఎం కిసాన్ యోజన పథకం, పీఎం కిసాన్ స్టేటస్ చెక్ ఆధార్ కార్డు" width="1600" height="1600" /> తాత లేదా తండ్రి పేరు మీద లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పుడు కూడా రైతులు పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు. భూమి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికిది వర్తించదు.(ప్రతీకాత్మక చిత్రం)
రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు కూడా పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక రైతు సంవత్సరానికి రూ. 10,000 పెన్షన్ పొందినట్లయితే, వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిబంధనలను అతిక్రమించి పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు తేలితే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.(ప్రతీకాత్మక చిత్రం)