పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకే డబ్బులు వస్తాయి. ఐతే 11వ విడతకు మాత్రం ఇది వర్తించదు. ఈసారి అర్హులైన వారందరికీ డబ్బులు వస్తాయి. నెక్ట్స్ విడత నుంచి మాత్రం ఈకేవైసీ పూర్తిచేసిన వారికే డబ్బులు జమజేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
అక్కడ క్లిక్ చేస్తే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ని నమోదు చేసి, ఇమేజ్ కోడ్‌ని నమోదు చేయాలి. అనంతరం సెర్చ్ బటన్‌ను నొక్కండి. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ మొబైల్లో OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి.. సబ్మిట్ చేస్తే.. e-KYC పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)