ముఖ్యంగా యూపీలో అక్రమార్కుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు యోగి సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలోనే వారందరినీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇన్నాళ్లు తీసుకున్న డబ్బులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా నోటీసులు పంపుతుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఝాన్సీ జిల్లాలో 2,489 మంది అనర్హులు ఉన్నట్లు యోగి ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇప్పటికే నోటీసులు పంపింది. ఐతే ప్రభుత్వ చర్యలకు భయపడి ఇప్పటి వరకు 185 మంది మొత్తం రూ.12 లక్షలకు తిరిగి చెల్లించారు. స్వచ్ఛందంగా డబ్బులు వాపసు ఇవ్వని వారిపై తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
పీఎం కిసాన్‌పై దేశవ్యాప్తంగా సోషల్ ఆడిటింగ్ నిర్వహిస్తారు.అనర్హులను గుర్తించి, వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. ఈ పథకాన్ని కేవలం చిన్న, సన్నకారు రైతుల కోసమే తీసుకొచ్చామని.. బాగా డబ్బులన్న వారు పిఎం కిసాన్ పథకం కింద ప్రయోజనం పొందితే.. ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)