Photos : బెంగళూరు ఎయిర్ షోలో అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం..

Air show 2019 : బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియా వద్ద మంటలు చెలరేగడంతో దాదాపు 300 వాహనాలు తగలబడ్డాయి. నిప్పు ఆర్పని సిగరెట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.