Petrol Price : వరుసగా ఆరో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు..

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలు తగ్గించడంతో పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజు కూడా దిగివచ్చాయి. అటు డీజిల్ ధరలు కూడా వరుసగా రెండో రోజు తగ్గాయి. పెట్రోల్ 13 పైసల నుంచి 14 పైసలు మేర తగ్గగా.. డీజిల్ ధరలు ఢిల్లీ,ముంబై,కోల్‌కతా,చెన్నై నగరాల్లో 7 పైసలు నుంచి 8 పైసలు మేర తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.86, లీటరు డీజిల్ ధర రూ.66గా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీ రూ.2 పెంచడంతో.. ఇంధన ధరలు పెరిగాయి. అయితే గత ఆరు రోజుల నుంచి వరుసగా పెట్రో ధరలు స్వల్ప మేర తగ్గుతుండటం గమనార్హం.