తెలంగాణలోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.42గా ఉంది. డీజిల్ ధర రూ.104.62కి చేరింది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 113.37 ఉండగా.. డీజిల్ ధర రూ.106.44కి లభిస్తోంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ రూ.112.21, డీజిల్ రూ.105.25కి దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
మన దేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు 120కి చేరువలో దాటింది. ప్రస్తుతం రూ.119.28గా ఉంది. నిన్నటిలో పోల్చితే ఇవాళ కాస్త తగ్గడం విశేషం. ఇక లీటర్ డీజిల్ ధర రూ.110.16గా ఉంది. గంగానగర్‌లో పెట్రోల్ రేటు రేపు 120 మార్క్‌ని దాటే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
సరిగ్గా గత ఏడాది ఇదే రోజున న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.81.06గా ఉంది. ఇప్పుడది 107.59గా ఉంది. అంటే గత ఏడాదిలో పెట్రోల్ రేటు ఏకంగా 27 రూపాయలు పెరిగింది. డీజిల్ గత ఏడాది 70.46గా ఉంటే.. ఇప్పుడు 96.32గా ఉంది. అంటే డీజిల్ కూడా రూ.26 పెరిగింది. రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)