Petrol Price today: తగ్గేదే లేదా..? మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఇవాళ్టి రేట్ల వివరాలు

Petrol Price today: వాహనాలు రోడ్డు మీదకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో పెట్రోల్, డిజిల్ రేట్ల దూకుడు కొనసాగుతోంది. సెంచరీ దాటినా ఆగడం లేదు. పెరగడమే తప్ప తగ్గడం లేదు. మూడు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం పెరిగాయి.