Petrol Price: పెట్రోల్ రేటు రూ.60కి తగ్గే ఛాన్స్.. కేంద్రం మదిలో కొత్త ప్లాన్.. అసలేంటది..?
Petrol Price: పెట్రోల్ రేటు రూ.60కి తగ్గే ఛాన్స్.. కేంద్రం మదిలో కొత్త ప్లాన్.. అసలేంటది..?
Petrol Rate: మండుతున్న ఇంధన ధరల నుంచి సామాన్య ప్రజలు కాస్త ఊరట లభించింది. దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను భారీగా తగ్గించింది కేంద్రం. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గింది.
కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించడంతో.. అక్కడ ఇంధన ధరలు మరింతగా తగ్గాయి. డీజిల్ రేటు కొన్ని చోట్ల ఏకంగా రూ.17 వరకు తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు తగ్గడంతో వాహనదారులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఐతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత భారీగా తగ్గించందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ.60కి తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచాలని యోచిస్తోంది. తద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఫ్లెక్స్ ఫ్యూయెల్కు అనుగుణంగా కంపెనీలు కూడా ఇంజిన్లన తయారు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల తయారీకి తక్కువే ఖర్చవుతుంది. ఈ ఇంజిన్లలో ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఇంధనం కూడా ఉపయోగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చే అకకాశముంది. అదే జరిగితే రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.60 దిగిరానుంది. డీజిల్ మరింత దిగి వచ్చే అవకాశముంది. ఆ రోజు కోసం దేశప్రజలంతా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)