Diesel Price: డీజిల్ కూడా సెంచరీ కొట్టేసింది.. తొలిసారి రూ.100 దాటి పరుగులు

Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రజలు గగ్గోలు పెట్టినా.. విపక్షాలు మండిపడుతున్నా.. చమురు కంపెనీలలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వాల కూడా పన్నులను తగ్గించే ఆలోచన చేయడం లేదు. ఈ క్రమంలో ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు సెంచరీ కొట్టగా.. ఇప్పుడు డీజిల్ కూడా సెంచరీ చేసింది.