Petrol Price: ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి పెట్రోల్ రేటు.. ఏపీలోని ఈ సిటీలో హైదరాబాద్ కంటే ఎక్కువ
Petrol Price: ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి పెట్రోల్ రేటు.. ఏపీలోని ఈ సిటీలో హైదరాబాద్ కంటే ఎక్కువ
Petrol and diesel rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగుతోంది. వరుసగా నాలుగో రోజు ఇంధన ధరలు పెరిగాయి. ప్రతి రోజూ 30 పైసల పైనే పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. మరి పెట్రోల్, డీజలల్ రేట్లు ఇవాళ ఎంత పెరిగాయి? దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.103.18గా ఉంది..(ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.61గా ఉంది. డీజిల్ రూ.102.71కి చేరింది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 111.50 ఉండగా.. డీజిల్ ధర రూ.104.48కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఏపీలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.111.86, డీజిల్ రూ.104.31కి చేరింది. విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.93, డీజిల్ రేటు రూ.103.42గా ఉంది.. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.105.49, డీజిల్ రేటు రూ.94.22గా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.43కి చేరింది. డీజిల్ 102.15కి లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.01, డీజిల్ 98,92కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.16కి చేరగా, డీజిల్ ధర 100ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.43, డీజిల్ రూ.97.68గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
మనదేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.117.72గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.108.53కి చేరింది.. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలతో పాటు విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం భారీగా పెంచుతున్నాయి. ప్రతి రోజూ 30 పైసలు పైగానే ధరలు పెరుగుతుండడంతో మనకు తెలియకుండానే పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)