మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు..వరుసగా 14వ రోజు పెంపు
మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు..వరుసగా 14వ రోజు పెంపు
దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు పెంచుతున్నాయి చమురు కంపెనీలు. వరుసగా 14వ రోజు కూడా రేట్లను పెంచాయి. ఇవాళ ఎంత మేర ధరలు పెరిగాయో ఇక్కడ చూడండి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతోంది. వరుసగా 14 రోజు కూడా ధరలను పెంచాయి చమురు సంస్థలు.
2/ 7
శనివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 51 పైసలు, లీటర్ డీజిల్‌పై 61 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.88 కాగా లీటర్ డీజిల్ ధర రూ.77.67గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
జూన్ 9 నుంచి దేశరాజధానిలో పెట్రోల్ ధర రూ.5.88 పెరగగా, డీజిల్ ధర రూ.6.50 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
కోల్‌కతాలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.80.62 కాగా, డీజిల్ ధర రూ.76.11. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
చెన్నైలో పెట్రోల్ ధర రూ.82.27 కాగా, డీజిల్ ధర రూ.75.29. కేంద్ర ప్రభుత్వం వ్యాట్, సెస్ పెంచడంతో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
లాక్డౌన్ కారణంగా 82 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేలా ఉన్నాయి. ధరల పెంచకుండా విరామం ఇచ్చిన కంపెనీలు..అప్పుడు అన్‌లాక్ 1లో ధరల మోత మోగిస్తున్నాయి.
7/ 7
గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)