ఇప్పటివరకూ మనం కిడ్నీ మార్పిడి, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఆపరేషన్ల గురించి విన్నాం. వాటిలో మరొకటి చేరింది. అదే అంగం మార్పిడి. రాజస్థాన్ జైపూర్‌లోని బుండీలో నివసిస్తున్న 72 ఏళ్ల ముసలాయన అంగానికి క్యాన్సర్ సోకింది. అందువల్ల దాన్ని తొలగించి, వేరేది అతికించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పగా.. అందుకు ఆ ముసలాయన ఒప్పుకోలేదు. కానీ డాక్టర్లు ఆయనకు ధైర్యం చెప్పి.. ఒప్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)
రాజస్థాన్‌లో ఇలాంటి ఆపరేషన్ చెయ్యడం ఇదే తొలిసారి అని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ శర్మ తెలిపారు. ఇది ఎంతో కష్టమైన ఆపరేషన్. ఒకే ఆపరేషన్‌లో మొత్తం భాగాన్ని తొలగించి.. తిరిగి ఏర్పాటు చెయ్యడం కష్టతరం అని వివరించారు. ఈ ఆపరేషన్ తర్వాత పేషెంట్‌కి ఎలాంటి సమస్యా లేదని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సర్జరీ విజయవంతం అయ్యేందుకు మైక్రో సర్జికల్ టెక్నిక్స్ ఉపయోగించినట్లు డాక్టర్లు తెలిపారు. కొత్త అంగం ఆకారం, పొడవు, యురెత్రా అన్నీ కరెక్టుగా ఉన్నాయని వివరించారు. ఆపరేషన్ తర్వాత.. ఆ ముసలాయన ఎప్పటిలాగానే నార్మల్ లైఫ్ స్టైల్ అనుభవించవచ్చని తెలిపారు. క్యాన్సర్ సోకే మగవాళ్లలో.. 4 శాతం మందికి ఇలాంటి క్యాన్సర్ సోకుతుందనీ.. 2 శాతం మందికి అంగం తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)