మరోవైపు గ్యాస్ లీక్ ఐనప్పుడు కంగారు పడకుండా ఏం చేయాలో తెలుసుకోండి. గ్యాస్ వాసన వస్తే, భయపడవద్దు. వంటగదిలో.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌లను ఆన్ చేయవద్దు. వంటగది, ఇంటి కిటికీలు, తలుపులు తెరవండి. రెగ్యులేటర్ ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ ఆన్ లో ఉంటె వెంటనే దాన్ని ఆఫ్ చేయండి. రెగ్యులేటర్‌ని ఆపివేసిన తర్వాత కూడా రెగ్యులేటర్‌ని తీసి సేఫ్టీ క్యాప్ ని పెట్టండి.
నాబ్‌ను కూడా బాగా తనిఖీ చేయండి. గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవడానికి.. రెగ్యులేటర్ అదేవిధంగా గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. పైపు కొంచెం చెడిపోయినట్లయితే, వెంటనే దాన్ని మార్చండి. అయితే ఇలాంటి స్టెప్స్ ఏమీ లేకుండా అన్ని పనులు ఆటోమెటిక్ గా ఐపోయేలా గ్యాస్ లీక్ ప్రమాదానికి సొలూష్యన్ కనిపెట్టాడు 13ఏళ్ల ప్రత్యూష్.