కరోనా కారణంగా కొన్నేళ్ల నుంచి స్కూల్స్ బంద్ అయ్యాయి. దీంతో విద్యార్థులంతా ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్కూల్స్ తెరుస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై క్లారిటీ లేదు. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇదిలా ఉంటే స్కూళ్ల మూసివేతతో తీవ్ర ప్రభావం చూపుతోందని పార్లమెంట్ స్థాయి సంఘం పేర్కొంది. బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధి సారథ్యంలోని కమిటీ ఇందుకు సంబంధించిన పార్లమెంట్‌కు నివేదిక సమర్పించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 6
స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే ప్రతికూల పరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 6
స్కూల్స్ మూసివేత కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొంది. స్కూళ్ల మూసివేత కారణంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 6
పాఠశాలలు మూతపడటం వల్ల దేశంలో బాల్య వివాహాలు కూడా పెరిగిపోయినట్టు కమిటీ నివేదిక పేర్కొంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 6
వీటిని దృష్టిలో పెట్టుకుని త్వరగా స్కూల్స్ తెరవాలని సూచించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్‌ను తెరవాలని నివేదికలో వెల్లడించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)