మీరు గమనించే ఉంటారు.. సూపర్ మార్కెట్లలో రాగులు, సజ్జలు, జొన్నల వంటివి.. బియ్యం కంటే ధర ఎక్కువగా ఉంటాయి. నిజానికి మన పూర్వీకులు వాటినే ఎక్కువగా తినేవారు. అప్పట్లో వాటి ధరే తక్కువ. కాలక్రమంలో.. వాటిని తినడం మానేసిన ప్రజలు.. బియ్యం, గోధుమలను ఎక్కువగా తినడం ప్రారంభించారు. దాంతో... మిల్లెట్స్ (Millets) సాగు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మిల్లెట్స్ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో.. వాటిని తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ దిగుబడి తక్కువగా ఉండటంతో.. వాటి ధరలు దాదాపు డబుల్ ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మిల్లెట్స్‌పై ఫోకస్ పెట్టి.. ఎంపీలకు మెనూలో వాటిని చేర్చుతోంది. (image credit - ANI)
జొన్న కూరగాయల ఉప్మా, గంట్ల కిచిడీ, రాగుల లడ్డూ వంటి వాటిని త్వరలో.. పార్లమెంట్ హౌస్ క్యాంటీన్ మెనూలో చేర్చబోతున్నారు. వీటితోపాటూ.. రెగ్యులర్ బిర్యానీ, కట్లెట్స్ వంటివి అలాగే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం.. ఈ మిల్లెట్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. త్వరలో జరిగే G20 సదస్సులో కూడా.. మిల్లెట్స్ వంటకాల్ని రుచి చూపిస్తామని ఆదివారం జరిగిన మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. (image credit - twitter)
మిల్లె్ట్స్ మెనూలో.. గంట్ల సూప్, రాగి దోసె, రాగి నెయ్యి రోస్ట్, రాగి తట్టె ఇడ్లీ, జొన్న కూరగాయల ఉప్మా, మక్కా రొట్టె, గంట్ల రొట్టె, జొన్న రొట్టె, రాగి పూరీ, మిల్లెట్ కిచిడీ, గంట్ల కిచిడీ వంటివి ఉంటాయి. అలాగే కేసరి ఖీర్, రాగి వాల్నట్ లడ్డూ, గంట్ల చూర్మా వంటివి కూడా ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ మిల్లెట్స్‌తో రకరకాల వంటలు చేస్తున్నారు. గుజరాత్లో గంట్లు ఉల్లి ముతియా, మధ్యప్రదేశ్‌లో షాహీ గంట్ల టిక్కీ, కేరళలో వేరుశెనగ చెట్నీతో రాగి దోసె వంటివి చేస్తున్నారు. (image credit - ANI)
ఈ కొత్త మెనూను ITDC ప్రిపేర్ చేస్తుంది. ఈ సంస్థ 2020 నుంచి పార్లమెంట్ క్యాంటీన్‌ను రన్ చేస్తోంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగినప్పుడు సరదాగా ఈ మెనూను ఓసారి పరిచయం చేశారు. దానికి ఎంపీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రాగి వాల్నట్ లడ్డూ, బజ్రేకీ రాబ్ ఎక్కువ మంది ఇష్టపడ్డారు. పార్లమెంట్ క్యాంటీన్తోపాటూ... అక్కడి కాంప్లెక్స్‌లోని మిగతా ఔట్‌లెట్స్‌లోనూ మెనూల్లో కూడా కనీసం ఒకటి మిల్లెట్స్‌తో చేసినది ఉండాలనే రూల్ తేబోతున్నారు. త్వరలో 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా అధికారికంగా పిలవనున్నారు. అప్పుడు వీటి వాడకం మరింత పెరుగుతుందనే అంచనా ఉంది. (image credit - ANI)
తెలంగాణ , రాజస్థాన్, , హర్యానా, , మధ్యప్రదేశ్, , , తమిళనాడులో మిల్లెట్స్ సాగు ఎక్కువగా జరుగుతోంది. (image credit - ANI)" width="1200" height="1600" /> ఇండియాలో 2003-04లో 2.13 కోట్ల టన్నుల మిల్లెట్స్ దిగుబడి ఉండేది.. 2021-22 నాటికి అది 1.59 కోట్లకు తగ్గిపోయింది. ఐతే.. ప్రపంచంలో మిల్లెట్స్‌ని ఎగుమతి చేస్తున్న టాప్ 5 దేశాల్లో భారత్ ఒకటి. 2021-22లో 6.42 కోట్ల డాలర్ల మిల్లెట్స్‌ని ఎగుమతి చెయ్యగా.. 2020-21లో 5.97 కోట్ల డాలర్ల మిల్లెట్స్ ఎగుమతి అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో మిల్లెట్స్ సాగు ఎక్కువగా జరుగుతోంది. (image credit - ANI)