పానీపూరి బండి వద్ద సాధారణంగా అబ్బాయిలే ఉంటారు.. అయితే అక్కడ మాత్రం ఓ మహిళ పానీపూరీ బండిని ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.
2/ 7
ఏరియాను బట్టి పానీపూరి వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పా లాంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు.
3/ 7
గ్వాలియర్‌లోని కైలాష్ టాకీస్ సమీపంలో ఆంటీ పానీపూరీ స్టాల్ ఉంది. ఈ స్టాల్‌ను జ్యోతిసింగ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఆమె పానీపూరీ చాలా ఫేమస్.
4/ 7
రోజుకు 3-4 గంటల్లోనే రెండు వేలకుపైగా గోల్ గప్పాలను ఆమె విక్రయిస్తున్నారంటే జ్యోతిసింగ్ స్టాల్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
5/ 7
పుదీనా, కొత్తిమీర, ఆవాలు, కొన్ని ప్రత్యేక మసాలా దినుసులను కలిపి గ్రీన్ వాటర్ తయారు చేస్తారని జ్యోతి సింగ్ తెలిపారు. ఎర్ర మిరపకాయలు, వేడి మసాలా దినుసుల మిశ్రమంతో రెడ్ వాటర్ తయారు చేస్తారు. ప్రజలు ఈ రెండు రకాల నీటితో గొల్గప్పను తినడానికి ఇష్టపడతారు.
6/ 7
ముఖ్యంగా యువతులు, మహిళలు ఇక్కడికి వచ్చి గోల్గప్ప రుచి చూస్తారు. జ్యోతిసింగ్ స్టాల్‌కు ఆయన భర్త కూడా సహకరిస్తున్నారు.
7/ 7
ఇక్కడ పానీపూరీ ప్లేట్ 10రూపాయలు, 20రూపాయలు అమ్ముతున్నారు. అంతే కాదు ఇక్కడ దొరికే సేవాపురిని తినడానికి కూడా ప్రజలు భారీగా వస్తున్నారు.