వాళ్లంతా నేరగాళ్లు.. దొంగతనాలు, మర్డర్లు చేసి జైలుకు వచ్చారు.. మరి వారిలో మార్పు తీసుకురావడం ఎలా..? జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వెళ్లి ఏం చేస్తారు..? ఇదే భయం పోలీస్ అధికారుల్లో ఉంది.. అందుకే ఖైదీలకు వేదమంత్రాలు నేర్పిస్తున్నారు.. పౌరోహిత్యంలో శిక్షణ ఇస్తున్నారు.
క్షణికావేశంలో హత్యలకు పాల్పడినవారు, మోసాలు, ఘోరాలకు పాల్పడిన వారికి జైల్లో పరివర్తన కలిగించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తుంటారు.
2/ 7
తోటపని, నవ్వారు, కొవ్వొత్తుల తయారీ, చదువుపై ఆసక్తి ఉన్నవారికి వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్లోని సాగర్ సెంట్రల్ జైలులో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
3/ 7
ఒకప్పుడు హత్యలు, మహిళలపై అకృత్యాలు సహా వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలు ఇప్పుడు వేదాలు, మంత్రాలు నేర్చుకుంటున్నారు.
4/ 7
ఆధ్యాత్మిక వేత్తల ద్వారా ఖైదీలకు వేదాలు, మంత్రాలను బోధిస్తున్నారు. యజ్ఞ కర్మలు, పురోహితులుగా స్ధిరపడేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.
5/ 7
కోర్సులో భాగంగా ఖైదీలకు ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తారు.
6/ 7
విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఆలయాల్లో అర్చకత్వంతో పాటు హోమాలు, యజ్ఞయాగాదులు చేయడంలో వీరికి తర్ఫీదునిస్తారు.
7/ 7
గురువులు బోధించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పురోహితుడిగా మారడం, సమాజంలో ప్రేమ, న్యాయం, సోదరభావం అనే భావనను ఏర్పచేలా ఇక్కడ నేర్పిస్తున్నారని శిక్షణ పొందిన ఖైదీలు చెబుతున్నారు.