ఇప్పుడు జడేజా ప్లాన్ ఏంటంటే... చుట్టుపక్కల రైతులందర్నీ ఓ గ్రూపుగా చేసి... అందరూ సేద్రియ పద్ధతుల్లోనే పంటలు పండించేలా చేయాలనుకుంటున్నడు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలూ అన్నీ ఆర్గానిక్ అవ్వాలనుకుంటున్నాడు. అలా పండించే వాటిని... రైతులే ప్రజలకు డైరెక్టుగా అమ్మితే... తక్కువ ధరకే ఆర్గానిక్ ఫుడ్ అందించినట్లు అవుతుందన్నది అతని ప్లాన్. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం, గవర్నర్... అందరూ సేంద్రియ వ్యవసాయమే చెయ్యమని కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు కూడా అది ఎలాగో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జడేజా ఓ అడుగు ముందున్నాడు.