Omicron Tension: మళ్లీ స్కూళ్ల మూసివేత..? మంత్రి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన
Omicron Tension: మళ్లీ స్కూళ్ల మూసివేత..? మంత్రి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన
Omicron Tension:
భారత్లో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియెంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం మళ్లీ స్కూళ్లపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించడం.. ఇండియాలో కేసులు పెరిగిపోతుండడంతో.. మళ్లీ స్కూళ్లను మూసివేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
1/ 8
ప్రస్తుతం మన దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులు ఇలాగే పెరిగితే మళ్లీ స్కూళ్లను మూసివేస్తామని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రభుత్వం సమీక్షిస్తోందని వర్షా గైక్వాడ్ అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మళ్లీ స్కూళ్లను మూసివేస్తామని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్యమే తమకు ముఖ్యమని చెప్పారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
మంత్రి వ్యాఖ్యలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. స్కూళ్లు మూతపడితే పిల్లల చదువులు పాడవుతాయని ఒకవైపు.. ఒమిక్రాన్ భయం మరో వైపు.. ఎన్నాళ్లీ ఇబ్బందులని టెన్షన్ పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 12, పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 తరగతుల విద్యార్థులు అక్టోబరు నుంచి తరగతులను ప్రారంభించారు. ప్రైమరీ విద్యార్థులు డిసెంబరు 1 నుంచి స్కూళ్లు తెరిచారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇక ముంబై, పుణెలో డిసెంబరు 15నే స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ అంతలోన మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో.. స్కూళ్ల మూసివేత దిశగా మహరాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కర్నాటకలో జనవరి 15 వరకు అన్ని రకాల కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేసుకుంటేనే పిల్లలను స్కూళ్లోకి అనుమతిస్తున్నారు. ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగితే స్కూళ్లను మళ్లీ మూసివేస్తామని ఇది వరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. (PTI Photo)
7/ 8
మన దేశంలో ఇప్పటి వరకు 216 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 38 మంది కేసులున్నాయి. చాప కింద నీరులా ఒమిక్రాన్ వ్యాపిస్తుండడంతో.. అందరిలోనూ మళ్లీ టెన్షన్ నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ముందు జాగ్రత్తగా పలు ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధంచాయి. మాస్క్ వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. లేదంటే భారీగా జరిమానాలు వేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)