OMG NEWS BIRTH OF STRANGE COLLODION CHILD BODY COVERED WITH PLASTIC LIKE LAYER INSTEAD OF SKIN SEE PICTURE SK
OMG: వింత శిశువు.. శరీరంపై చర్మం లేదు.. ప్లాస్టిక్ బాడీతో పుట్టిన బాలుడు
Plastic Baby: ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. పిల్లికి పాలిస్తున్న కుక్క.. చెట్టు నుంచి పాలు కారడం.. వంటి విచిత్రాలు టీవీలు, పేపర్లలో చూశాం. తాజాగా ఔరంగాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలుడు ప్లాస్టిక్ శరీరంతో జన్మించాడు. అవును ఇది నిజం.. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బాబు శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. ఐతే అతడి శరీరం అందరిలా లేదు. సాధారణంగా మన చర్మం మెత్తగా, మృదువుగా ఉంటుంది. కానీ అతడి శరీరం మొత్తం ప్లాస్టిక్ వంటి పొర ఉంది.
2/ 5
ఆ చిన్నారి కొలోడియన్ (collodion) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి చేతులు, కాళ్ల వేళ్లతో పాటు శరీరం మొత్తం ప్లాస్టిక్ పొరలా ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలను 'ప్లాస్టిక్ బేబీస్' అని కూడా పిలుస్తారు.
3/ 5
కొలోడియన్ అనేది ప్రపంచంలోని అరుదైన వ్యాధులలో ఒకటి. ఇది తల్లిదండ్రుల కణాల్లో లోపాల కారణంగా వస్తుంది. రెండు క్రోమోజోమ్‌లకు సోకినట్లయితే పుట్టిన బిడ్డకు కొలోడియన్ వచ్చే అవకాశముంది. ఈ వ్యాధి వల్ల పిల్లల చర్మం ప్లాస్టిక్‌లా ఉంటుంది.
4/ 5
క్రమంగా పొర పగిలిపోవడం వల్ల.. భరించలేని నొప్పి ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగితే ప్రాణాలను కాపాడటం చాలా కష్టం. ఇంతకు ముందు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఇలాంటి శిశువే జన్మించినట్లు వార్తలు వచ్చాయి.
5/ 5
ప్రపంచంలో ప్రతి 11 లక్షల మంది శిశువుల్లో ఒకరికి ఇది సోకుతుంది. SNCUలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఐతే అతడు ఎన్ని రోజులు బతుకుతాడో డాక్టర్లు గ్యారంటీ ఇవ్వడం లేదు.