Milk ATM: ఇక ఇంటింటికీ పాలను డెలవరీ చేయనున్న మిల్క్ ఏటీఎంలు! మొబైల్ మిల్క్ ఏటీఎం
Milk ATM: ఇక ఇంటింటికీ పాలను డెలవరీ చేయనున్న మిల్క్ ఏటీఎంలు! మొబైల్ మిల్క్ ఏటీఎం
పాలు డెలివరీ చేసే ఏటీఎం కూడా ఉంటుందని విన్నారా? పాల ఏటీఎమ్ పలు నగరాల్లో ఉన్నప్పటికీ.. మనమే అక్కడకు వెళ్లీ పాలు తీసుకోవాలి..అయితే ఇది మొబైల్ మిల్క్ ఏటీఎం.. అంటే మన దగ్గరకే పాలు వస్తాయి.
పాల ఏటీఎంల(Milk ATM) సర్వీసులు ఇక దేశవ్యాప్తంగా మొదలయ్యే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
బీహార్‌కు చెందిన వినయ్ భాగల్పూర్లో మిల్క్ ఏటీఎంను ప్రారంభించాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
వినయ్ గతంలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. ఉద్యోగం మానేసిన తర్వాత మొదట్లో ఏడాది పాటు పలు విషయాలపై పరిశోధనలు చేశారు. అయితే అతనికి ఈ మిల్క్ ఆలోచన వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ మొబైల్ మిల్క్ ఏటీఎం భాగల్ఫూర్ నగరంలోని అన్ని ప్రాంతాలకు నిర్ణీత సమయంలో చేరుకుంటుంది. మొబైల్ మిల్క్ ఏటీఎం ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ అని వినయ్ చెబుతున్నాడు.
5/ 7
మిల్క్ ఏటీఎం ఆలోచన టీవీ నుంచి వచ్చిందని వినయ్ చెప్పాడు. ఆ తర్వాత సబూర్ అగ్రికల్చరల్ కాలేజీలో శిక్షణ తీసుకుని పాల ఏటీఎంను ప్రారంభించాడు. మా పాల ఏటీఎంల ద్వారా ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడిందంటున్నాడు వినయ్.
6/ 7
కొన్ని హోటళ్లలో పాలు సరఫరా చేస్తామని.. పాల నాణ్యత విషయంలో మేం రాజీపడమంటున్నాడు.
7/ 7
పాల ఏటీఎంల నుంచి లీటరు పాలను రూ.48కే సరఫరా చేస్తున్నారు. అదే సమయంలో హోమ్ డెలివరీ కింద పాల ధర లీటరుకు రూ.52గా ఉంది.