Viral News: మీరు కలలో కూడా ఇంత పెద్ద ముల్లంగిని చూసి ఉండరు.. ఎన్ని కిలోలు ఉందంటే?
Viral News: మీరు కలలో కూడా ఇంత పెద్ద ముల్లంగిని చూసి ఉండరు.. ఎన్ని కిలోలు ఉందంటే?
Giant Radish: మనం ముల్లంగితో సాంబారు, రసం చేసుకుంటాం. రుచి అమోఘంగా ఉంటుంది. సాధారణంగా ఈ ముల్లంగి బరువు గ్రాముల్లో ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సొరకాయ సైజులో ఉన్న ఇంత పెద్ద ముల్లంగిని చూశారా?
మార్కెట్లో మనకు కనిపించే ముల్లంగి బరువు మహా అయితే.. 50 నుంచి 100 గ్రాములు ఉంటుంది. ఇంకొంచెం పెద్దదయితే పావు కిలో వరకు ఉంటుంది. కానీ ఇవి 5 కేజీల సైజులో కూడా ఉంటాయంటే నమ్మడం కాస్త కష్టమే..!
2/ 7
మహారాష్ట్రలో ఈ భారీ ముల్లంగిలు సాగవుతున్నాయి. ఇలాంటి వాటిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇవి సొరకాయ పెద్ద సైజులో.. దాదాపు 5 కేజీల బరువు ఉన్నాయి. మరి ఇవి ఎంత పెద్దగా ఎలా పెరిగాయో తెలుసుకుందాం.
3/ 7
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జ్ఞానదేవ్ అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వేరుశనగ సాగు చేస్తున్నాడు. కొంత భూమిలో ముల్లంగిని కూడా పండిస్తున్నాడు. ఐతే వాటి బరువు ఏకంగా ఐదు కిలోల వరకు పెరిగింది.
4/ 7
జ్ఞానదేవ్ పొలంలో పండిన ముల్లంగిల్లో దాదాపు 15 ఇలా 5 కేజీల బరువు పెరిగాయి. ఇంత పెద్ద ముల్లంగిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సొరకాయ కంటే పెద్ద సైజులో ముల్లంగి ఉండడంతో నోరెళ్లబెట్టుతున్నారు.
5/ 7
జ్ఞాన్ దేవ్ ఆవు పేడతో పాటు సూపర్ ఫాస్ఫేట్ ఎరువును ఉపయోగించి ముల్లంగిని పండించాడు. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మాత్రమే నీళ్లు పోసి ముల్లంగి సాగు చేశాడు. దీని వల్లనే ముల్లంగి భారీగా పెరిగిందని ఈ రైతు చెబుతున్నాడు.
6/ 7
సాధారణంగా గ్రాముల్లో బరువుండే ముల్లంగి.. ఏకంగా మొత్తం ఐదు కేజీలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీటిని సమీపంలోని హోటళ్లకు విక్రయించాడు జ్ఞానదేవ్.
7/ 7
ఈ భారీ ముల్లంగిల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చుట్టు పక్కల ప్రాంతాల రైతులు జ్ఞానదేవ్ పొలానికి వెళ్తున్నారు. ముల్లంగిని అంత పెద్ద సైజులో ఎలా పండించాడో అడిగి తెలుసుకుంటున్నారు.