బసిర్హత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్ నుస్రత్ జహాన్ తొలినాళ్లలో వీలుచిక్కినప్పుడల్లా ప్రజలను కలిసేవారు. అయితే పదవి చేపట్టిన కొద్ది నెలలకే ఓ హిందువును పెళ్లాడటం, అతని ద్వారా కాకుండా మరో స్నేహితుడి బంధం పెట్టుకొని భర్తకు దూరమై బాబుకు కూడా జన్మనివ్వడం.. ఇలా అనేక మలుపులు తిరింగిందామె జీవితం.
వ్యక్తిగత జీవితంలో అనూహ్య మలుపుల కారణంగా నుస్రత్ జహాన్ దాదాపు ఏడాదిన్నర కాలంగా సొంత నియోజకవర్గం బసిర్హత్ వెళ్లలేకపోయారు. అయితే ఎంపీ కనబడుటలేదు అని పోస్టర్లు పెట్టింది మాత్రం ప్రత్యర్థులు కాదట. టీఎంసీలోనే నుస్రత్ వ్యతిరేక వర్గీయులు ఎంపీ మిస్సింగ్ పోస్టర్లను చాలా చోట్ల అంటించారట. కానీ టీఎంసీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇది ప్రత్యర్థుల పనే అంటున్నారు.