ప్రతి వ్యక్తి ఈ రోజును తన వైపు నుంచి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి పదవీ విరమణ భిల్వారా జిల్లాలో జరిగింది.. ఇది మొత్తం పట్టణానికి ప్రత్యేకమైంది. వాస్తవానికి, భిల్వారా నివాసి.. మండల్ బ్లాక్‌లోని శ్యాంపుర ఆసుపత్రిలో పనిచేస్తున్న శాంతా దేవి జింగార్ తన ఉద్యోగం చివరి రోజున హెలికాప్టర్లో ఆసుపత్రికి చేరుకుంది.
హెలికాప్టర్లో కూర్చోవాలనే కోరిక గురించి 2 నెలల క్రితమే తన అత్త చెప్పిందని శాంతా దేవి మేనల్లుడు శుభమ్ జింగార్ చెప్పారు. అప్పటి నుంచి తాను ఇదే పనిమీద తిరుగుతున్నట్లు చెప్పాడు. ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ కంపెనీతో మాట్లాడానన్నాడు జింగార్. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి కోసం జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఒప్పించాడు మేనల్లుడు జింగార్.. హెలికాప్టర్ బుకింగ్‌కు దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చయ్యాయట.