అయితే గతంలో ఇంట్లో పరిస్థితులు బాలేకపోవడం వల్లే ఈ వృద్ధురాలు ఆహారం తినకుండా కేవలం ద్రవపదార్థాలతో జీవించడం అలవాటు చేసుకున్నారని అనిమా కుమారుడు చెబున్నారు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేదని, ఆమె మాత్రం టీ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుని సరిపెట్టుకునేవారని, అదే అలవాటుగా మారిందని చెప్పారు.
వృద్ధురాలు ఆహారం తినకుండా జీవించడంపై అక్కడి స్థానికులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అనిమాను చూస్తున్నానని, ఆమె ఎప్పుడూ ఘన ఆహారం తీసుకోవడం చూడలేదని, కేవలం టీ ఇతర ద్రవ పదార్థాలే తీసుకుంటారని చెప్పారు. తమ గ్రామంలో ఇలాంటి మహిళ ఉండడం గర్వంగా ఉందని కూడా తెలిపారు.
* ఎలా సాధ్యమైంది? : అనిమా చక్రబర్తి లైఫ్‌స్టైల్‌పై హుగ్లీకి చెందిన బిల్లేశ్వర్ బల్లవ్ అనే డాక్టర్ మాట్లాడారు. ‘మన శరీరం రోజువారీ విధులు నిర్వర్తించడానికి శక్తి, కేలరీలు, పోషకాలు అవసరం. తినే ఆహారం ఘన పదార్థమైనా, ద్రవ పదార్థమైనా అందులో పోషకాలు ఉంటే శరీరంలో సాధారణ శ్వాస, జీర్ణ ప్రక్రియలు నడవడానికి సహకరిస్తాయి. కణాలకు అవసరమైన మొత్తం శక్తి అంటే కేలరీలు ద్రవ పదార్థం నుంచైనా తీసుకుంటే సమస్య ఉండదు’ అని డాక్టర్ పేర్కొన్నారు.
ఆమె తీసుకునే టీ, ఇతర ద్రవ పదార్థాల నుంచి ఆమెకు జీవించడానికి సరిపడ పోషకాలను అందిస్తోందని, దీంతో ఆమె ఆరోగ్యంగా ఉందని డాక్టర్ బల్లవ్ తెలిపారు. ఇది మరీ ఆశ్యర్యకరమేమీ కాదని, కోమాలో ఉన్న వారు లేదా చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని శరీరానికి సరిపడా ద్రవాలను అందించడం ద్వారా బతుకుతారని వెల్లడించారు.