కరోనా వైరస్ ఇంకా పూర్తిగా ముగియలేదు, ఇప్పుడు ప్రమాదకరమైన నోరోవైరస్(Norovirus)కేసులు తెరపైకి వచ్చాయి. కేరళలో అనేక నోరోవైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. కేరళలోని ఎర్నాకులం తర్వాత ఇప్పుడు కొచ్చిలో నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. కొచ్చిలోని ఒక స్కూల్ లో చాలా మంది పిల్లలలో నోరోవైరస్ లక్షణాలు కనిపించాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇద్దరు పిల్లలకు నోరోవైరస్ పాజిటివ్ అని తేలింది. మరో 15 మంది పిల్లలు కూడా దీని లక్షణాలను కలిగి ఉన్నారు. నోరోవైరస్ కూడా సరిగ్గా కరోనా వైరస్ లాంటిదే.(Photo : ANI)
అనేక నోరోవైరస్ కేసులు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఆందోళన పెరిగింది. దీనికి ముందు, ఎర్నాకులంలో ఏకకాలంలో 19 మంది పిల్లలలో నోరోవైరస్ కనుగొనబడింది. ఇక్కడ మొదటి 2 మంది పిల్లలలో నోరోవైరస్ నిర్ధారించబడింది, ఆ తర్వాత మొత్తం 19 మంది పిల్లలు సోకినట్లు గుర్తించారు. కొంతమంది పిల్లల బంధువులలో కూడా దీని లక్షణాలు కనిపించాయి. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ రిస్క్ దృష్ట్యా పాఠశాల మూసివేయబడింది. ఆన్లైన్లో క్లాస్ లు నడుస్తాయి. గతేడాది జూన్, నవంబర్‌లో కూడా నోరోవైరస్ లక్షణాలు కనిపించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
నోరోవైరస్ కి వ్యతిరేకంగా నివారణ చాలా ముఖ్యం. ఇది కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం, వ్యాధి సోకిన వ్యక్తితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు వాంతులు, విరేచనాలు. వైరస్ సోకిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో సోకిన వ్యక్తికి వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. రోగికి వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి,శరీర నొప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
నోరోవైరస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు. వేడినీటితో చంపబడదు. పిల్లలు, వృద్ధులు ఈ వైరస్‌తో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ఎందుకంటే వ్యాధి సోకడం,అధిక వాంతులు మరియు విరేచనాలు కారణంగా వారి పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్.. నోరోవైరస్ను నివారించడానికి, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని పేర్కొంది. పండ్లు, కూరగాయలు ఉపయోగించే ముందు వేడి నీటిలో బాగా కడగాలి.